Mar 18,2023 23:24

పద్మనాభంలో సంబరాలు జరుపుకుంటున్న తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు

ప్రజాశక్తి-యంత్రాంగం
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి బలపర్చిన వేపాడ చిరంజీవిరావు విజయం సాధించడంతో శనివారం పలు ప్రాంతాల్లో ఆ పార్టీ శ్రేణులు విజయోత్సవ సంబరాలు నిర్వహించారు.
భీమునిపట్నం : స్థానిక టిడిపి కార్యాలయంలో పార్టీ నియోజక వర్గ ఇంఛార్జి కోరాడ రాజబాబు ఆధ్వర్యాన కేక్‌ కట్‌ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు, జివిఎంసి 2, 4 వార్డుల నాయకులు బడిగింటి నీలకంఠం, పాసి నరసింగరావు, నగర కార్యదర్శి పిట్టా సురేష్‌, మండల అధ్యక్షులు డిఎఎన్‌.రాజు, నాయకులు వై.అనీల్‌ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.
టి.నగరపాలెంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాణసంచా కాల్చారు. కేక్‌ కట్‌ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ పొట్నూరు రాము, పార్టీ నాయకులు తమ్మిన వెంకట రమణ పాత్రుడు, పూసర్ల రామారావు, పి.చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.
కంచరపాలెం : 54వ వార్డు పరిధి ఐటిఐ జంక్షన్లో వార్డు టిడిపి అధ్యక్షులు, రాష్ట్ర తెలుగు యువత ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కార్తీక్‌ కుట్ట ఆధ్వర్యాన ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి పరస్పరం తినిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సీతమ్మధార : జీవీఎంసీ 26వ వార్డులో టిడిపి కార్పొరేటర్‌ ముక్కా శ్రావణి ఆధ్వర్యాన కేక్‌ కట్‌ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షులు ముక్కా కిషోర్‌కుమార్‌, ముక్కా శివ, నర్సింగ్‌ పాల్గొన్నారు.
పద్మనాభం : పద్మనాభం జంక్షన్‌కు మండలంలోని పలు గ్రామాల నుంచి టిడిపి కార్యకర్తకు చేరుకొని సంబరాలు జరుపుకున్నారు. పార్టీ కార్యాలయం వద్ద ఉన్న ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంపిణీ చేశారు. పార్టీ మండల అధ్యక్షులు కోరాడ రమణ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో జెడ్‌పిటిసి మాజీ సభ్యులు కె.దామోదరరావు, పైల శ్రీను, కాళ్ల శ్రీను, కాళ్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
దేవరాపల్లి : మాడుగుల నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి పివిజి.కుమార్‌ ఆధ్వర్యంలో దేవరాపల్లిలో సంబరాలు జరుపుకున్నారు. దేవరాపల్లి నాలుగు రోడ్లు జంక్షన్లో ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి కుమార్‌తో పాటు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్‌ కట్‌ చేసి ఒకరికి ఒకరు తినిపించుకున్నారు. భారీ ఎత్తున బాణాసంచాలు కాల్చి, కేరింతలు కొడుతూ సందడి చేశారు. కార్యక్రమంలో అనకాపల్లి పార్లమెంటు టిడిపి ఉపాధ్యక్షుడు చల్లా నానాజీ, మండల టిడిపి ప్రధాన కార్యదర్శి శరకాన సూర్యనారాయణ, నేతలు పోతల పాత్రునాయుడు, కొమరా బాబురావు, కె. నాగేశ్వరరావు, మాజీ టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు బండారు రామారావు, కర్రి నాయుడు, వారాది కన్నబాబు చామంతుల వెంకన్న, శంకరరావు, బండారు అప్పలనాయుడు ఉన్నారు.
అచ్యుతాపురం : ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి ఘనవిజయంతో ఆపార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. కేక్‌ కట్‌ చేశారు. బాణసంచా కాల్చారు. మిఠాయిలు పంచారు. తిమ్మరాజుపేట, హరిపాలెం, సెజ్‌ కాలనీ, పూడిమడక, తదితర గ్రామాల్లో టిడిపి కార్యకర్తలు విజయోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.