Feb 16,2023 23:46

మాట్లాడుతున్న వాసుదేవరావు

ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్‌ : ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ పర్చూరు నియోజకవర్గ ఎలక్షన్‌ డిప్యూటీ తహశీల్దారు వాసుదేవరావు తహశీల్ధారు కార్యాలయంలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బూత్‌ లెవెల్‌ ఆఫీసర్లకు ఫాం-68, ఓటు కార్డుతో ఆధార్‌ అనుసంధానం మరియు ఫొటో సిమిలర్‌ ఎంట్రీ గురించి చర్చించారు. అధికారులు, సిబ్బంది ఎలాంటి ఇబ్బంది లేకుండా సందేహాలను నివృతి చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఎలక్షన్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ సత్యనారాయణ, ఇంకొల్లు డిప్యూటీ తహశీల్దారు జి.గీతారాణి, రెవెన్యూ డిప్యూటీ తహశీల్దారు బి.లక్ష్మీకుమారి, ఎఎస్‌ఎ పుష్పలత, ఎలక్షన్‌ ఆపరేటర్‌ సుధీర్‌, తదితరులు పాల్గొన్నారు.