ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎమ్మెల్యే శిల్పా సమావేశం
ప్రజాశక్తి - ఆత్మకూరు
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్‌లపై ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అధ్యక్షతన ఆత్మకూరు పార్టీ కార్యాలయం నందు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశమునకు నియోజవర్గ అబ్జర్వర్ సురేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ మధుసూదన్, నియోజవర్గ సమన్వయకర్త శిల్పా భువనేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. సమావేశంలో ఎమ్మెల్యే శిల్పా మాట్లాడుతూ వైసిపి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వైసిపి నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ఓటు వేయాలో స్థానిక రాజకీయ నాయకులైన ఎంపీటీసీలకు జడ్పిటిసిలకు, కౌన్సిలర్లకు మాస్ ఓటింగ్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. శిల్పా భువనేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎలక్షన్లకు గ్రామాల గ్రామాల వారీగా వార్డుల వారీగా ఎలక్షన్లు అబ్జర్వర్లను ఎంపిక చేసి వారికి వారి చేయవలసిన పని వివిధ విధానాలను తెలియజేశారు. ఈ సమావేశంలో ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ ఆసియా, మండల ఎంపీపీ నల్ల కాలువ తిరుపాలమ్మ, ఎంపీటీసీలు కౌన్సిలర్లు, జడ్పిటిసి మెంబర్స్, నాయకులు పాల్గొన్నారు.










