Mar 11,2023 23:36

అధికారులతో మాట్లాడుతున్న ఆర్‌డిఒ

ప్రజాశక్తి -రోలుగుంట:మండలంలోని ఎంపిపి స్కూల్‌లో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్‌ కేంద్రాన్ని నర్సీపట్నం ఆర్డీవో హెచ్‌వి.జయరాం శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ, పోలింగ్‌ స్టేషన్‌లో అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. ఆయన వెంట తహశీల్దార్‌ వెంకటేశ్వరరావు ఉన్నారు.
కొత్తకోట:రావికమతంలో ఎన్నికల పోలింగ్‌ కేంద్రాన్ని నర్సీపట్నం ఆర్డీవో జయరాం శనివారం పరిశీలించారు. రావికమతం హైస్కూల్లో 167వ పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పోలింగ్‌ కేంద్రం వద్ద విద్యుత్‌, తాగునీరు, బందోబస్తు ఏర్పాట్లపై తహసీల్దార్‌ మహేశ్వరరావును అడిగి తెలుసుకున్నారు. పోలింగ్‌ కేంద్రానికి 200 మీటర్ల దూరం వరకూ ఏ వాహనాలు నిలపరాదన్నారు. కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వ ఉద్యోగులెవ్వరూ పోలింగ్‌ ఏజెంట్లుగా ఉండరాదన్నారు. ఓటర్‌గా ఉన్నవారే ఏజెంట్లుగా ఉండాలన్నారు. పోలింగ్‌ కేంద్రంలోకి ప్రజాప్రతినిదులను అనుమతించవద్దని ఆధికార్లకు సూచించారు. ఆయన వెంట ఆర్‌ ఐ చినబాబు తదితరులు పాల్గొన్నారు.