ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియపై నోడల్ అధికారులు, సెక్టోరల్ అధికారులు కీలక పాత్ర పోషించాలి.
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియపై నోడల్ అధికారులు, సెక్టోరల్ అధికారులు కీలక పాత్ర పోషించాలి.
గైర్హాజరైన పోలింగ్ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయండి.
పోలింగ్ కేంద్రాలలో సౌకర్యాలను పరిశీలించండి
జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్.
ప్రజాశక్తి నంద్యాల కలెక్టరేట్
పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో నోడల్ అధికారులకు, సెక్టోరల్ అధికారులకు అప్పగించిన పనులను బాధ్యతాయుతంగా నిర్వహించి పోలింగ్ సరళిని సజావుగా జరపాలని జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని వైయస్సార్ సెంటినరీ హాలులో జాయింట్ కలెక్టర్ టి. నిశాంతితో కలిసి నోడల్ అధికారులు, సెక్టోరల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్ మాట్లాడుతూ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళిని పకడ్బందీగా నిర్వహించేందుకు నోడల్ అధికారులు, సెక్టోరల్ అధికారులు కీలకపాత్ర పోషించాలన్నారు. పోలింగ్ అధికారుల శిక్షణా తరగతులకు గైరుహాజరైన ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డిఆర్ఓను ఆదేశించారు. సెక్టోరల్ అధికారులు జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలను సందర్శించి విద్యుత్తు, టాయిలెట్స్, ఫర్నిచర్, ర్యాంపులు తదితర సౌకర్యాలను పరిశీలించాలన్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నివేదికలు సిద్ధం చేయాలని డిఎస్పి మహేశ్వర్ రెడ్డిని కలెక్టర్ ఆదేశించారు. షార్ట్ టెండర్లను పిలిచి పోలింగ్ సామాగ్రిని సమకూర్చుకునేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత నోడల్ అధికారిని ఆదేశించారు. పోలింగ్ ప్రక్రియకు అవసరమయ్యే వాహనాలను సమకూర్చాలని డిటిసిని ఆదేశించారు. స్వీప్ కార్యక్రమం ద్వారా ఓటర్లలో విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. గుర్తించిన భద్రతా గదులను పరిశీలించి లోటుపాట్లపై చర్యలు తీసుకోవాలని సంబంధిత నోడల్ అధికారిని ఆదేశించారు.










