Mar 09,2023 23:42

స్ట్రాంగ్‌ రూమ్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌ రవి పఠాన్‌శెట్టి

ప్రజాశక్తి-అనకాపల్లి
ఈ నెల 13న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను గురువారం కలెక్టర్‌ రవి పఠాన్‌ శెట్టి పరిశీలించారు. స్థానిక ఏఎంఏఏ హైస్కూల్లో వెబ్‌ కాస్టింగ్‌, పేపర్లు భద్రపరిచే స్ట్రాంగ్‌ రూములను సందర్శించారు. సామాగ్రి పంపిణీ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఎన్నికలు ఎన్ని గంటలకు ప్రారంభించాలి, ఎన్ని గంటలకు పూర్తి చేయాలి, వాహన ఏర్పాట్ల బందోబస్తు వంటి అంశాలపై అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎన్నికల ప్రక్రియపై నోడల్‌ అధికారులతో వెబ్‌ ఎక్స్‌ ద్వారా సూచనలు అందించారు. కార్యక్రమంలో ఆర్డీవో చిన్నికృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.