ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు
ప్రజాశక్తి-దేవరాపల్లి
ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో బీసీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు అన్నారు. సోమవారం దేవరాపల్లిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీల పక్షపాతిగా సీఎం జగన్ మరో మారు నిరూపించుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. ప్రాంతాలవారీగా సామాజిక న్యాయాన్ని పాటించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసిపి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో జెడ్పిటిసి కర్రి సత్యం, మాజీ ఎంపీపీ కిలపర్తి భాస్కరరావు, వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ సింహాచలం నాయుడు, వైసిపి మండల అధ్యక్షులు బూరె బాబురావు, నాయకులు కర్రి సూరి నాయుడు, గూడుపు రాము, రెడ్డి బలరాం, ఉర్రోకుల అప్పారావు, కోలా వెంకటరమణ, దాసరి సంతోష్, కాటిపాము పెదనాయుడు తదితరులు పాల్గొన్నారు.










