Sep 17,2023 01:04

ప్రజాశక్తి - బాపట్ల 
ఎస్సీ వర్గీకరణ బిల్లును ఈనెల 18 నుండి 22వరకు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మహాజన సోష లిస్టు పార్టీ ఆధ్వర్యంలో చీలు రోడ్డు సెంటర్లో చేపట్టిన   రిలే నిరసన దీక్షలు శనివారం 9వ రోజుకు చేరాయి. మంద కృష్ణ మాదిగ సూచనల మేరకు జరుగుతున్న దీక్షల్లో ఎంఎస్‌పి బాపట్ల జిల్లా అధ్యక్షులు బుడంగుంట్ల లక్ష్మీ నరసయ్య, వేమూరు నియోజకవర్గ ఇన్చార్జి ఎలమాటి దాసు, బాపట్ల పట్టణ కన్వీనర్ తాళ్లూరు రాజేష్, మాసిపోకు వేణు, మాసిపోగు యేసు రత్నం, కటికల అబ్రహం, రేపూరు కిషోర్, పరిసపోగు దేవా,  కొమ్మూరి స్వరూప్, కటికల పౌలు పాల్గొన్నారు.