ప్రజాశక్తి-అనంతపురం వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం నగరంలోని అశోక్‌నగర్‌లో ఉన్న యాపిల్ గార్డెన్స్‌లో వైసిపి ప్రజాప్రతినిధులు, సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు, కార్యకర్తలకు 'ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలంటే' కార్యక్రమంపై వేర్వేరుగా శిక్షణ ఇచ్చా రు. ఇందులో భాగంగా కార్యక్రమాన్ని నిర్వహించాలో పవర్‌పాయింట్ ప్రజెంటే షన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఎన్నో ప్రభుత్వాలు, ఎంతోమంది ముఖ్యమంత్రులు పని చేసిపా జగన్ చేసిన మంచి ప నులు ఎవరూ చేయలేరన్నారు. జగన్ ప్రభుత్వంలో మాత్రమే వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు సేవకులుగా వ్యవహరిస్తున్నారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏకంగా రూ.3.38 లక్షల కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని వివరించారు. మరో ఆరు నెలల్లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు సాగాలన్నారు. కావున నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటినీ సందర్శించి ప్రజలకు చేసిన మంచిని వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నర్సింహయ్య, మేయర్ మహమ్మద్ వసీం, డిప్యూటీ మేయర్లు వాసంతిసాహిత్య, కోగటం విజయభాస్కర్‌రెడ్డి, నాయకులు చింతా సోమశేఖరరెడ్డి, లక్ష్మన్న, చింతకుంట మధు, రమణారెడ్డి, ఫయాజ్, సైఫుల్లాబేగ్, కాగజ్‌ఘర్ రిజ్వాన్, కొండ్రెడ్డి ప్రకాష్‌రెడ్డి, కార్పొరేటర్లు శేఖర్‌బాబు, ఎం,దేవి, బోయ సుమతి, సాకే చంద్రలేఖ, నరసింహులు, కార్పొరేటర్లు మునిశేఖర్, లాలు, శ్రీనివాసులు, లావణ్య, లీలావతి, సోని రమణ, ముంతాజ్‌బేగం, సుజాత, అబూసాలెహా, రామాంజినమ్మ, లక్ష్మి దేవి, మల్లికార్జున, సంపంగి రామాంజినేయులు, మీనాక్షి, ఓబిరెడ్డి, గౌస్‌బేగ్, ఖాజా, రమేష్‌గౌడ్, ఉమ్మడి మదన్‌మోహన్‌రెడ్డి, హుస్సేన్‌పీరా, రాధాకృష్ణ, కృష్ణవేణి, వాసగిరి నాగ్, సాకే కుళ్లాయిస్వామి, అనంత చంద్రారెడ్డి, బాకే హబీబుల్లా, పెన్నోబుళేసు, సుజాతారెడ్డి, రాధాయాదవ్, వైసీపీ నేతలు, కార్యకర్తలు, సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి










