గుమ్మలకీëపురం.. సర్వే చేపడుతున్న సర్పంచ్, సచివాలయ సిబ్బంది
ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం : మండలంలోని ఎల్విన్‌పేట సచివాలయం-1 పరిధిలో సోమవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఆర్.చైతన్య స్రవంతి, పంచాయతీ కార్యదర్శి శ్యామల ఇంటింటికి వెళ్లి జగనన్న ఆరోగ్య సురక్షపై ప్రజలకు వివరించారు. కుటుంబ సభ్యుల వివరాలు, దీర్ఘకాలిక వ్యాధులు, ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 31న నిర్వహించే ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని కోరారు.
గరుగుబిల్లి : జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై పెద్దూరు గ్రామంలో వాలంటీర్లు, ఆశావర్కర్లు ఇంటింటి సర్వే నిర్వహించారు. జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం నిర్వహించి వైద్య సేవలు అందిస్తామని వారు తెలిపారు.










