ఘనంగా సౌతిండియా షాపింగ్‌మాల్ ప్రారంభం
ఏలూరు అర్బన్: ఏలూరు నగరంలో సినీతారలు సందడి చేశారు. స్థానిక పత్తేబాద్‌లో డీమార్ట్ పక్కనే నూతనంగా ఏర్పాటు చేసిన సౌత్ ఇండియా షాపింగ్‌మాల్‌ను శుక్రవారం సినీతారలు అనుపమ పరమేశ్వరన్, పాయల్ రాజ్‌పుత్ ప్రారంభించారు. నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నగర ప్రముఖులు, పెద్దసంఖ్యలో నగర ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ ఏలూరు నగరంలో సౌత్ ఇండియా షాపింగ్‌మాల్ ప్రారంభోత్సవంలో భాగస్వామినైనందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ షోరూమ్‌లో అన్ని వయస్సుల వారి కోసం దుస్తులు అందు బాటులో ఉన్నాయని తెలిపారు. రాబోయే వివాహ, పండుగ సీజన్లకు సంప్రదాయాల ఫ్యాషన్ ఇక్కడ అందుబాటులో ఉందన్నారు. ఇక్కడ కంచి, ధర్మవరం, ఆరణి, ఉప్పాడ, పోచంపల్లి డిజైన్ శారీలు, కోయంబత్తూరు, బెంగళూరు, కేరళకు చెందిన డ్రెస్‌లు, సల్వార్‌సూట్‌లు, లెహంగాస్, కిడ్స్‌వేర్, మెన్స్‌వేర్, ఎత్నిక్ వేర్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో షాపింగ్‌మాల్ డైరెక్టర్లు పాల్గొన్నారు.










