Nov 03,2022 21:48

            ఏలూరు అర్బన్‌:మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఏలూరు విచ్చేశారు. ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్లో ఆయనకు అధికారులు, బిజెపి నాయకులు ఘన స్వాగతం పలికారు. ఏలూరు రైల్వే స్టేషన్‌ నుండి రోడ్డు మార్గాన గన్నవరం, ఆత్కూర్‌ గ్రామం దగ్గర ఉన్న స్వర్ణ భారత్‌ ట్రస్ట్‌కు ఆయన బయలుదేరారు. ఏలూరు ఆర్‌డిఒ పి.కిషోర్‌ ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.