Sep 27,2023 17:46

ప్రజాశక్తి - భీమడోలు
   వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనల మేరకు పైరును నష్టపరిచే ఎలుకల నివారణా చర్యలు చేపట్టాలని భీమడోలు జడ్‌పిటిసి సభ్యురాలు తుమ్మగుంట భవాని రంగా కోరారు. సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమంలో భాగంగా భీమడోలు వ్యవసాయ అధికారి ఎస్‌పిబి.ఉషారాణి ఆధ్వర్యంలో ఎలుకల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జడ్‌పిటిసి పాల్గొనగా, అతిథిగా రైతు భరోసా కేంద్రాల మండల ఛైర్మన్‌ పసుపులేటి సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎడి మాట్లాడుతూ పైరుకు నష్టం కలిగించడంతో పాటు, దిగుబడిపై ప్రభావం చూపించే ఎలుకల నివారణను సామూహికంగా చేపట్టి, మేలైన ఫలితాలు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ వ్యవసాయ సహాయకులు రామలక్ష్మి, శ్రీలత పాల్గొన్నారు.