చిత్తూరుఅర్బన్ : ఎల్ పి ఎం (ల్యాండ్ పార్షియల్ మ్యాపింగ్ మెంబర్) బేస్డ్ రిజిస్ట్రేషన్ ల పై దృష్టి సారించాలనికలెక్టర్ ఎస్. షన్మోహన్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులుతో కలసి రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ఎల్ పి ఎం సర్వే పూర్తి అయిన గ్రామాలలో ఎల్ పి ఎం బేస్డ్ 22(ఎ) జాబితా అప్ లోడ్ చేయడం జరుగుతుందని, దీని ఆధారంగా 22(ఎ) లిస్ట్ లను సవరించవలసినదిగా సూచించారు. జిల్లాలో రీసర్వేలో మొదటి విడతలో 132 గ్రామాలలో పూర్తి కాగా రెండవ విడతలో 91 గ్రామాలలో పూర్తి అయ్యిందని తెలిపారు. కొత్త సాఫ్ట్ వేర్ ప్రైమ్ 2.0 పని తీరును రిజిస్ట్రార్ కలెక్టర్‌కు వివరించారు. ఈ సమావేశం లో జిల్లా రిజిస్ట్రార్ శ్రీనివాస రావు, చిత్తూరు, చిత్తూరు రూరల్, బంగారుపాలెం, పలమనేరు, కుప్పం, పుంగనూరు, కార్వేటినగరం, నగరి, సబ్ రిజిస్ట్రార్ లు పాల్గొన్నారు.










