Jul 04,2023 20:18

కార్యక్రమంలో మాట్లాడుతున్న తహశీల్దార్‌

ప్రజాశక్తి - హోళగుంద
మండలంలోని ఎల్లార్తి గ్రామంలో సర్పంచి కురువ చాముండేశ్వరి ఆధ్వర్యంలో 'జగనన్న సురక్ష' నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్‌ హుస్సేన్‌ సాబ్‌, ఇఒఆర్‌డి చంద్ర మౌళీశ్వర గౌడ్‌, యువ నేత ఎస్‌కె.గిరి మాట్లాడారు. పేదలు, పేద లబ్ధిదారులు ఎవరూ పథకాలకు దూరం కాకూడదని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి 'జగనన్న సురక్ష' కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఇంకా పథకాలను అందని లబ్ధిదారులుంటే గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. అనంతరం లబ్ధిదారులకు తహశీల్దార్‌ హుస్సేన్‌ సాబ్‌ అడంగల్‌, క్యాస్ట్‌, ఫ్యామిలీ సర్టిఫికెట్‌ అందజేశారు. పంచాయతీ కార్యదర్శి మహ్మద్‌ షాపి, విఆర్‌ఒ ప్రహ్లాద పాల్గొన్నారు.