ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్‌విడి.ప్రసాద్ డిమాండ్ చేశారు. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జంగారెడ్డిగూడెం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో 2023 డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ స్థానిక ఆలపాటి గంగాభవాని ఫంక్షన్ హాలులో కామన్ సంజరు అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. విద్యుత్ శాఖ డిఇ కెఎం.అంబేద్కర్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్‌విడి.ప్రసాద్ క్యాలెండర్, డైరీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్‌విడి.ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం అమలు చేయడం లేదన్నారు. కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలన్నారు. రానున్న రోజుల్లో కాంట్రాక్ట్ కార్మికుల హక్కులు సాధించుకోవాలని తెలిపారు. ట్రాన్స్‌కో డిఇ డిఇ కెఎం.అంబేద్కర్ మాట్లాడుతూ వర్కర్స్ సిఐటియు ఆధ్వర్యంలో ఈ క్యాలెండర్ డైరీ ఆవిష్కరిచం డంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు టౌన్ కార్యదర్శి షేక్ సుభాషిని, సిఐటియు టౌన్ అధ్యక్షులు పి.సూర్యరావు, యుఇసిడబ్ల్యుయు జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి చంద్రశేఖరం, డివిజన్ అధ్యక్షులు దొండపాటి నాగేంద్ర, డివిజన్ ప్రధాన కార్యదర్శి బాలిన సత్యనారాయణ, డివిజన్ ఉపాధ్యక్షులు పెనుమత్స బాపిరాజు పాల్గొన్నారు.










