ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్:బలిఘట్టం బ్రహ్మ లింగేశ్వర స్వామి ఆలయ సమీపంలో విజయలక్ష్మి దుర్గ ప్రైవేట్ ఎలక్ట్రికల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఎలక్ట్రికల్ కంపెనీలు స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎలక్ట్రికల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డివి సత్యనారాయణ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఐదు లక్షల మంది ఎలక్ట్రికల్ వర్కర్లు సభ్యులుగా ఉన్నారని, రాష్ట్ర ప్రభుత్వం సహకారం సరిగా లేకపోవడంతో వర్కర్స్ కొన్ని ఇబ్బందులకు ఎదురవుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రికల్ వర్కర్స్‌ను ఆదుకోవాలని కోరారు. ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ సమావేశానికి ప్రతినెల హాజరవ్వాలని, పొదుపు చేస్తే అన్ని విధాలా అసోసియేషన్ ఆదుకుంటుందని తెలిపారు. ప్రతి సంవత్సరం జనవరి 27న ఎలక్ట్రికల్ డే జరుపు తున్నామన్నారు. రాష్ట్రంలో ఎలక్ట్రికల్ వర్కర్స్ ఐక్యతతో ఉండాలని, అప్పుడే ఏదైనా సాధించుకోగలమని ఆయన అన్నారు. ప్రమాదం బారిన పడిన వర్కర్స్‌ను యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుండి ఆదుకుంటుందని ఇన్సూరెన్స్ సభ్యులు ఇక్బాల్, రమణ తెలిపారు. ఎలక్ట్రికల్ వర్కర్లు భీమా నమోదు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బాలాజీ, కోటేశ్వరరావు, నర్సీపట్నం ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ సెక్రటరీ డి.వెంకట సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.










