ఎలక్షన్ గోడౌన్ పరిశీలన
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్: జిల్లా సచివాలయంలోని ఎలక్షన్ గోడౌన్‌లో భద్రపరిచిన ఈవిఎంల కుబెల్ ఇంజనీర్లచే కొనసాగుతున్న ఆక్సెప్టేన్స్ టెస్ట్ ప్రొసీజర్‌ను జిల్లా కలెక్టర్ ఎస్.షన్మోహన్ పరిశీలించారు. బుధవారం ఉదయం బెల్ కంపెనీ ప్రతినిధులు ఈవీఎంలకు ఆక్సెప్టేన్స్ టెస్ట్ ప్రొసీజర్ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ ఎస్.షన్మోహన్ మాట్లాడుతూ.. భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో రెండంచెల భద్రత నడుమ 12 మంది బెల్ ఇంజనీర్ల సమక్షంలో ఈనెల 16 నుండి ఫస్ట్ లెవెల్ చెకింగ్ జరుగుతుందని తెలిపారు. జిల్లాకు కొత్తగా బెల్ కంపెనీ నుండి చేరుకున్న 2,510 బ్యాలెట్ యూనిట్లు, 4,390 కంట్రోల్ యూనిట్ల, 3617 వివి పాడ్స్‌లకు ఆక్సెప్టేన్స్ టెస్ట్ ప్రొసీజర్‌ను చేస్తున్నారని తెలిపారు. జిల్లాలో గతంలో ఉన్న పాత 2,353 బ్యాలెట్ యూనిట్లు, 1,448 కంట్రోల్ యూనిట్ల, 1,711 వివి పాడ్స్ ఉన్నాయన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 24/7 పటిష్ట పోలీస్ భద్రత, సిసి కెమరాల పర్యవేక్షణ, విజిటింగ్ రిజిస్టర్ వంటి తదితరాలు ఏర్పాటు చేసామని తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంట డిప్యూటీ కలెక్టర్ చంద్రశేఖర్ నాయుడు, ఎన్నికల సూపరింటెండెంట్ బ్యూలా, ఎలక్షన్స్ సెల్‌సిబ్బంది ఉమాపతి, మనోజ్‌కుమార్, రెవెన్యూ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు.










