Dec 01,2022 21:52

ప్రజాశక్తి - చింతలపూడి
       చింతలపూడిలో పర్యటించిన చంద్రబాబు ఎంఎల్‌ఎ ఎలిజాపై చేసిన వ్యాఖ్యలను నిరసిసూత వైసిపి నేతలు, కార్యకర్తలు స్థానిక ఫైర్‌స్టేషన్‌ సెంటర్లో ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి చంద్రబాబు డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. అనంతరం చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. దీన్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కార్యకర్తలు కొందరు దిష్టిబొమ్మను పక్కకు తీసుకెళ్లి పెట్రోలు పోసి నిప్పంటించి దహనం చేశారు. కార్యక్రమంలో వైసిపి పట్టణాధ్యక్షులు కొప్పుల నాగు, సొసైటీ ఛైర్మన్‌ ఆత్కూరి సుబ్బారావు, ఎంఎల్‌ఎ సోదరుడు జీవన్‌, సిటీ మెడికల్‌ అధినేత దుర్గారావు, వెంపా కృష్ణ, మోహన్‌ పాల్గొన్నారు.