కడప అర్బన్ : యోగి వేమన విశ్వవిద్యాలయం పరిధిలోని ఎల్‌ఎల్‌బి మూడు, ఐదేళ్ల సెమిస్టర్, బాచిలర్ ఆఫ్ ఫైన్‌ఆర్ట్స్ పరీక్షల ఫలితాలను విశ్వవిద్యాలయ విసి ఆచార్య చింతా సుధాకర్ తన చాంబర్లో విడుదల చేశారు. విశ్వవిద్యాలయ రిజిస్టర్ ఆచార్య వై.పి.వెంకటసుబ్బయ్య, పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎన్.ఈశ్వర్‌రెడ్డితో కలిసి పరీక్షల ఫలితాలపై చర్చించారు. అనంతరం ఫలితాల గురించి విసి మాట్లాడుతూ సెప్టెంబర్‌లో జరిగిన పరీక్షల ఫలితాలను త్వరితగతిని విడుదల చేసేందుకు కషి చేసిన పరీక్షల విభాగాన్ని అభినందించారు. మూడేళ్ల ఎల్‌ఎల్‌బి 2వ సెమిస్టర్ 339 మంది హాజరు కాగా 190 మంది ఉత్తీర్ణత (56.05 శాతం) సాధించారని తెలిపారు. ఐదేళ్ల ఎల్‌ఎల్‌బి కోర్సులో 6వ సెమిస్టర్ పరీక్షలు 72 మంది రాయిగా 40 మంది (55.56 శాతం) ఉత్తీర్ణత సాధించారన్నారు. 8వ సెమిస్టర్‌లో 111 మంది హాజరు కాగా 78 మంది విద్యార్థులు (70.27 శాతం) పాసయ్యారని వివరించారు. 10వ సెమిస్టర్ లో 126 మంది విద్యార్థుల పరీక్షలు రాయగా 106 మంది (84.13 శాతం) ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ 2,4,6 సెమిస్టర్ల లో 100 శాతం ఉత్తీర్ణత లభించిందని తెలిపారు. పరీక్షల విడుదల కార్యక్రమంలో పరీక్షల నియంత్రణ సహాయ అధికారి డాక్టర్ సుమిత్ర పాల్గొన్నారు.