May 13,2023 23:56

ఏలేరు కాలువ గట్టున అప్పారావు మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

ప్రజాశక్తి- కశింకోట : మండలంలోని తాళ్లపాలెం గ్రామానికి చెందిన తనకాల అప్పారావు (63) ఏలేరు కాలువలో శవం శనివారం తేలాడు. కశింకోట పోలీసుల కథనం ప్రకారం.... అప్పారావు తన ఇంటి నుంచి గురువారం ఉగ్గినపలెం గ్రామం లో వారి బంధువుల వివాహం నిమిత్తం వెళ్ళాడు. పెళ్లి అయిన తరువాత రోజు శుక్రవారం మధ్యాహ్నం సుమారు 3.30 గంటల ప్రాంతంలో బహిర్భూమి కోసం ఉగ్గినపాలెంలో ఉన్న ఏలూరు కాలువ దగ్గరికి వెళ్లి ప్రమాదవశాత్తు జారీ కాలువలో పడిపోయారు. తండ్రి కనిపించకపోవడంతో శుక్రవారం తన కుమారుడైన తనకాల నాగేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఏలేరు కాలువలో శనివారం అప్పారావు మృతదేహం తేలింది. మృతదేహాన్ని అదనపు ఎస్‌ఐ నాగేశ్వరరావు పరిశీలించారు. ఎస్‌ఐ ఆదినారాయణ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.