Mar 31,2023 22:46

ప్రజాశక్తి మైలవరం : మైలవరం లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాల లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ విభాగంలో అధ్యాపకులుగా పని చేస్తున్న పి దీపక్‌ రాజుకు పిహెచ్డి ప్రధాన మైనట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె అప్పారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బ్రోనౌట్‌ -బేస్డ్‌ పవర్‌ అల్లఓకేషన్‌ స్ట్రాటెజిస్‌ ఇన్‌ మైక్రోగ్రీడ్స్‌ అనే అంశంపై చేసిన పరిశోధనకు ఈ అవార్డు ప్రధానమైనట్లు ఆయన తెలిపారు. ఈ పరిశోధన విద్యుత్‌ వధా ని తగ్గించే ప్రయత్నం, వాతావరణ కాలుష్యాన్ని నివారించడానికి ఈ పరిశోధన పనిచేస్తుందన్నారు.ఈ సందర్భంగా కళాశాల ప్రెసిడెంట్‌ జి శ్రీనివాస్‌ రెడ్డి, బి శ్రీనివాస్‌ రావు, అధ్యాపక,అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు అభినందించారు.