Sep 01,2023 22:33

ఫొటో : ప్రమాణస్వీకారం చేస్తున్న సర్పంచ్‌ మంగళ తిరుమల

ఎల్‌ఆర్‌ అగ్రహారం సర్పంచ్‌ ప్రమాణస్వీకారం
ప్రజాశక్తి-జలదంకి : రాజకీయాలకు కుల, మతాలకు అతీతంగా చిత్తశుద్ధితో పనిచేస్తానని ఎల్‌ఆర్‌ అగ్రహారం నూతన సర్పంచిగా ప్రమాణ స్వీకారం చేసిన మంగళ తిరుమల పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఎంపియుపి స్కూల్లో సర్పంచ్‌ పదవి ప్రమాణోత్సవం నిర్వహించారు. స్థానిక పంచాయతీ కార్యదర్శి జి.సురేంద్ర ఆధ్వర్యంలో తిరుమల ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలకు, కుల, మతాలకతీతంగా స్థానిక ప్రజలు తనకు ఓట్లు వేసి తన విజయానికి అండగా నిలిచారన్నారు.
తాను కూడా ప్రజల విశ్వాసానికి కట్టుబడి చిత్తశుద్ధితో పనిచేస్తానని ప్రమాణం చేశారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు అభ్యర్థులు రంగంలోకి దిగి ప్రజలను ప్రేలో బాలకు గురి చేసినప్పటికీ, ప్రతిపక్ష పార్టీకి చెందిన తనను గెలిపించారన్నారు. తనపై ప్రజలు చూపిన ఆదరణకు తాను కట్టుబడి పంచాయతీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. నిష్పక్షపాతంగా సేవలు చేసి అందరి ప్రశంసలు పొందుతానన్నారు. కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు కొర్రపాటి రామారావు, గుర్రం ప్రవీణ్‌, ఒంటేరు జయచంద్ర రెడ్డి, మంగళ శ్రీనివాసులు, గొట్టిపాటి శ్రీధర్‌, గాలి శ్రీనివాసులు, మంగళ కోటేశ్వరరావు, ఎడవల్లి నాగేశ్వరరావు, మంగళ తిరుమల 9వ వార్డు నెంబర్‌ (టిడిపి) వర్థినేని వేణు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.