May 17,2023 00:42
గోడ పత్రికలను ఆవిష్కరిస్తున్న నాయకులు

ప్రజాశక్తి-అద్దంకి: జీవిత బీమాలో పనిచేస్తున్న ఎల్‌ఐసి ఏజెన్సీస్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇండియా మహాసభ విశాఖపట్నంలో ఈ నెల 22, 23 తేదీలలో జరుగుతుందని, దీనిని జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కౌన్సిల్‌ మెంబర్‌ రాగిపిండి రామకోటిరెడ్డి అన్నారు. మంగళవారం పట్నంలోని జీవిత బీమా కార్యాలయం వద్ద ఏఓఐ, ఐసియు, సిఐటియు నాయకులు ఆల్‌ ఇండియా మహాసభల గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐసీయూ బ్రాంచి కార్యదర్శి తోటకూర లక్ష్మీనారా యణ మాట్లాడుతూ ఎల్‌ఐసిలో పనిచేస్తున్న ఉద్యోగులు ఏజెంట్లకు అనుబంధంగా సిఐటియు ఉందని, అందరం కలిసి జీవిత బీమాను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్‌ఐసి అధ్యక్షులు వినీత్‌, ఎల్‌ఐసి ఏఓఐ బ్రాంచ్‌ కార్యదర్శి ఎస్‌కె కాలేబాషా, బోడపాటి హనుమంతరావు, తంగిరాల వెంకటేశ్వర్లు, నాయకులు కెవి పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.