ఎల్‌ఐసి కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ నాయకులు
ప్రజాశక్తి-చోడవరం
భారతీయ బీమా సంస్థ (ఎల్‌ఐసి), భారతీయ స్టేట్ బ్యాంక్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చోడవరంలోని ఆయా సంస్థల కార్యాలయం ముందు సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడానికి కంకణం కట్టుకుందని మండిపడ్డారు. మోడీ ప్రభుత్వం మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ కులాల మధ్య మతాల మధ్య అగ్గిరాజేస్తుందని విమర్శించారు. సామాన్యుడు కొనలేని విధంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజలను ఇబ్బందులు గురిచేస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గూనూరు వెంకటరావు, కూండ్రపు అప్పారావు, ఐఆర్.గంగాధర్, వివిధ మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.










