ప్రజాశక్తి - కార్వేటినగరం: ఏకో టూరిజం హబ్ కుప్పానిగుంట ఫారెస్టును అభివద్ధి చేస్తామని జిల్లా అటవీశాఖ అధికారి (ఐఎఫ్‌ఎస్‌ఓ) చైతన్యకుమార్రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రం సమీపంలోని కుప్పానిగుంటను రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామితో కలసి సందర్శించారు. ఈ సందర్భంగా డీఎఫ్‌వో మాట్లాడుతూ పుత్తూరు-కార్వేటినగరానికి మార్గమధ్యంలో ఉన్న కుప్పానిగుంటను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో నగర వనయోజన పథకం ద్వారా అభివద్ధి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.రెండు కోట్లు మంజూరు చేసిందన్నారు. ఇప్పటికే రూ. కోటి నిధులు మంజూరు అయ్యాయని డీఎఫ్‌ఓ పేర్కొన్నారు. ముఖ్యంగా పట్టణ ప్రజలకు అనుకూలంగా, అడవుల్లోని ఆహల్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడం కోసం వాకింగ్ ట్రాక్, చిన్నారుల ఆట స్థలం, జిమ్ము, విద్యార్థులకు విద్యపరంగా జ్ఞానాన్ని పెంచే విధం వివిధ రకాలైన అవగాహన కార్యక్రమాలతో పాటు అతిథిగహం నిర్మాణ చేపట్టి చూపరులను ఆకట్టుకునే విధంగా అభివద్ధి చేస్తామని తెలిపారు. అనంతరం మంత్రితో పాటు డీఎఫ్‌ఓ 7 కిలో మీటర్ల మేరా నడిచి సందర్శించారు. ఇందులో బాగంగా నక్షత్ర తాబేలు కుప్పానిగుంట ప్రాంతంలో ఆకస్మింగా కనిపించడంతో వాటిని డీఫ్వో నక్షత్ర తాబేలు విశిష్టతను వివరించారు. దీంతో మంత్రి వెంట ఉన్న వారు పవిత్రంగా భావించి తాబేలుకు మొక్కులు తీర్చుకున్నారు. అలాగే ఎకో టూరిజం ఏర్పాటుకు అనుమతించిన అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కతజ్ఞతలు తెలిపారు. వెంకట్రాద్రిపురం బటీ ప్రాంతంలో ఉన్న దారి సమస్యను పుత్తూరు ఎఫ్వ్రోతో పాటు కార్వేటినగరం ఎఫ్‌ఆర్‌ఓతో కలసి సందర్శించి పరిష్కరించారు. అనంతరం కార్వేటినగరం తలమానికంగా ఉన్న స్కంధపుష్కరిణీ, రాణిమహలు సందర్శించారు. కార్యక్రమంలో కార్వేటినగరం ఎస్‌ఆర్‌ఓ వెంకట సుబ్బయ్య, సెక్షన్ అటవీశాఖ అధికారి రవిరావు, స్థానిక సర్పంచ్ ధనంజయవర్మ, ఉప సర్పంచ్ శేషాద్రి, జిల్లా కార్యదర్శి గోపి, రైతు విభాగం కార్యదర్శి పద్మనాభశెట్టి, వెంకటేష్, వెంకటరత్నం, దాము, పలువురు పాల్గొన్నారు.










