Sep 09,2023 01:04

ప్రజాశక్తి - చీరాల
డిల్లీకి చెందిన ఎకో ఇండియా, నేషనల్ గ్రీన్ కార్ప్స్ (ఎన్‌జిసి) ఆధ్వర్యంలో
రాష్ట్రంలో వ్యాప్తంగా ఎన్‌జిసి సమన్వయకర్తలు, క్లస్టర్ కో ఆర్డినేటర్లకు పర్యావరణంపై రెండు రోజుల శిక్షణ విశాఖ పౌర గ్రంథాలయంలో జరిగింది. కార్యక్రమానికి చీరాల ఉపాధ్యాయుడు బాపట్ల జిల్లా తరపున జిల్లా కో ఆర్డినేటర్‌గా పవని భానుచంద్రమూర్తి పాల్గొన్నారు. పర్యావరణ హితం కోసం పాఠశాలల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలు, వాటిని అమలు చేయవలసిన విధానాలు గురించి తెలియజేశారు. కార్యక్రమంలో ఆర్‌జెడి జ్యోతి కుమారి, డిప్యూటీ డి గౌరీశంకర్, ఎకో ఇండియా అధినేత దీపా ఝా, రాష్ట్ర సమన్యయకర్త పి నీలకంఠం, గ్రీన్ క్లైమేట్ వ్యవస్థాపకులు జెవి రత్నం  సమక్షంలోశిక్షణ అనంతరం ధృవీకరణ పత్రాలు అందజేశారు.