Dec 22,2022 00:12

పాఠశాలలో వివరాలు అడిగి తెలుసుకుంటున్న ఐటిడిఎ పిఒ సూరజ్‌ గనోరే

ప్రజాశక్తి-రాజవొమ్మంగి
రాజవొమ్మంగిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏకలవ్య పాఠశాలను ఐటిడిఎ సూరజ్‌ గనూరే, సబ్‌ కలెక్టర్‌ శుభం బన్సల్‌ బుధవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పాఠశాల పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారికి పెడుతున్న మెనూపై ఆరా తీశారు. పాఠశాలలో సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యార్థులు శ్రద్ధతో చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని సూచించారు. పాఠశాలకు ప్రహరీ నిర్మాణం చేపట్టకపోవడంతో పరిశీలించి ప్రహరి నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వారి వెంట రాజవొమ్మంగి డిప్యూటీ తాహసిల్దార్‌ అల్లి సత్యనారాయణ, ఎంపీడీవో కె బాపన్న దొర, పాఠశాల ప్రిన్సిపల్‌ కష్ణారావు తదితరులున్నారు.