Nov 10,2023 22:14

ఇళ్ల ముందు పూడ్చకుండా విడిచిపెట్టిన గొయ్యలు

 

సీతానగరం: మండలంలోని లక్ష్మీపురంలో జల జీవన్‌ మిషన్‌ కింద ఇంటింటి కొళాయి ద్వారా నీళ్లు సరఫరా చేసేందుకు మెయిన్‌ లైన్‌ పైపులు వేసేందుకు తవ్విన గోతులు పూడ్చకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. సీతానగర - అజ్జాడ ప్రధాన రహదారి కావడంతో వాహనదారులకు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గడిచిన 10 రోజులుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పటికీ ఏ ఒక అధికారి పట్టించుకోవడంలేదని, ఈ సమస్యను ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎఇ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా స్పందించడంలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా పనుల్లో పూర్తిగా నాణ్యత లోపించిందని, సంబంధిత అధికారుల పర్యవేక్షణా లోపం వల్లే నాసిరకంగా చేపట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు.