Oct 21,2023 20:27

జగదీశ్వరికి బొట్టుపెట్టి ఆహ్వానిస్తున్న గిరిజన మహిళ

ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం : గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో టిడిపి చేపడుతున్న కార్యక్రమాలకు గిరిజనుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇందులో భాగంగా మండలంలోని మారుమూల కొండమీద గ్రామమైన వనకాబడిలో బాబుతో నేను కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కురుపాం నియోజకవర్గం ఇంచార్జి తోయక జగదీశ్వరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వనకాబడి గ్రామ గిరిజనులు ఆమెకు సాదర స్వాగతం పలికారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి చంద్రబాబు నాయుడు అరెస్టు గురించి వివరించారు. మన కష్టాలు పోవాలంటే, గిరిజనాభివృద్ధి జరగాలంటే టిడిపిని తప్పక గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మహిళా ప్రధాన కార్యదర్శి వెంపటాపు భారతి, మండల కార్యదర్శి పోలూరు శ్రీనివాసరావు, క్లస్టర్‌ ఇంచార్జ్‌ కిల్లక దాసు, యూనిట్‌ ఇంచార్జీలు సోమరావు, అడ్డాకుల నరేష్‌, తాడంగి రామారావు, ధర్మ, సీతారాం, సుందర్‌ రావు, అనంత్‌, త్రినాద్‌ దొర, చిట్టిబాబు, బాల పాల్గొన్నారు.
ఎన్‌టిఆర్‌ ఆశయ సాధనకు కృషి చేద్దాం
జియ్యమ్మవలస మండలం చినబుడ్డిడి గ్రామంలో ఎన్‌టిఆర్‌ విగ్రహావిష్కరణ మొదటి వార్షికోత్సవాన్ని శనివారం నిర్వహించారు.ఈ సందర్భంగా టిడిపి నాయకులు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎన్‌టిఆర్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం గ్రామంలో బాబుతో నేను కార్యక్రమాన్ని నిర్వహించి చంద్రబాబు అరెస్టుపై ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పల్ల రాంబాబు, అరుకు పార్లమెంట్‌ అధికార ప్రతినిధి డొంకాడ రామకృష్ణ, ఎంపిపి బొంగు సురేష్‌, మూడడ్ల సత్యంనాయుడు, గురాన శ్రీరామ్మూర్తి నాయుడు, బుజింగ రావు, మాజీ సర్పంచ్‌ కరణం అప్పలనాయుడు, రాయిపిల్లి భారతి పాల్గొన్నారు.