
నల్లరాయిగూడ పొలాల్లో సంచరిస్తున్న ఏనుగులు
ప్రజాశక్తి -భామిని : మండలంలోని నల్లరాయిగూడ పంచాయతీ పరిధిలో గల ఇసుకగూడ, సన్నాయిగూడ ప్రాంతాల మధ్య 4 ఏనుగుల గుంపు గత ఆదివారం నుండి తిష్ట వేశాయి. ఈ ప్రాంతంలో గిరిజనుల వరిపొలాలు, అరటి, జీడీ తోటలు ఉన్నాయి. ఏపుగా పెరిగిన వరిని నాశనం చేస్తున్నాయని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే మచ్చన్న చెరువు, గంగన్న చెరువుల్లో నీటిని తాగి వచ్చి, పంట పొలాలపై తిరుగుతూ ఉండడంతో వరి చేలు నాశనమవుతున్నాయని గిరిజనులు వాపోతున్నారు. ఈ నాలుగు ఏనుగులు గ్రామ పరిసరాల్లోకి నలుగురు కేర్ టేకర్లు పరిశీలిస్తున్నట్లు ఫారెస్ట్ బీట్ అధికారి లక్ష్మణమూర్తి తెలిపారు.