Sep 15,2023 19:03

ప్రజాశక్తి - జీలుగుమిల్లి
   ఏజెన్సీ గ్రామాల్లో దోమల తీవ్రత ఎక్కువగా వుండడంతో విష జ్వరాల బారినపడే అవకాశం ఉన్నందున దోమల మందు పిచికారి చేస్తున్నట్లు మలేరియా సబ్‌ యూనిట్‌ అధికారి పెద్దిరాజు తెలిపారు. శుక్రవారం జీలుగుమిల్లి పిహెచ్‌సి పరిధిలోని గిరిజన గ్రామాలైన బర్రింకలపాడు, ఉదయ భాస్కర్‌ కాలనీలలో దోమల నివారణకు మలాథీయన్‌ మందును పిచికారి చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ వంటి జ్వరాలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతిఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమ తెరలను వాడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి సున్నం సురేష్‌, హెల్త్‌ అసిస్టెంట్‌ ప్రసాద్‌, రవీంద్ర, ఎఎన్‌ఎం లు, ఆశాలు పాల్గొన్నారు.