Nov 06,2023 21:11

గుమ్మలక్ష్మీపురం: మేనిఫెస్టోను అందిస్తున్న జగదీశ్వరి

ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం : మండలంలోని కూరసింగి, ఒప్పంగి గిరిజన గ్రామాల్లో సోమవారం సాయంత్రం టిడిపి నాయకులు భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ఇంచార్జి తోయక జగదీశ్వరి మాట్లాడుతూ గిరిజన బతుకులు బాగుపడాలంటే 2024లో టిడిపిని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క గిరిజనుడిపైనా ఉందన్నారు. అనంతరం ఇంటింటికి వెళ్లి టిడిపి మేనిఫెస్టోను వివరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు సురేష్‌, హరికృష్ణ, రామారావు, బాల, త్రినాథ్‌ అడ్డాకుల కుసుమమ్మ, మండలం మహిళా కార్యదర్శి జానకి తదితరులు పాల్గొన్నారు.
సీతంపేట : మండలంలోని మండ గ్రామంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ'' కార్యక్రమం పాలకొండ నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్‌ నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత చేయబోయే సంక్షేమ పథకాలు గురించి, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు సవర తోట మొఖలింగం, ప్రధాన కార్యదర్శి బిడ్డిక అప్పారావు, సర్పంచ్‌ బిడ్డిక నీలయ్య, ఐటిడిపి హిమరక పవన్‌, సవర సూర్యం, సవర బిగ్‌ బాస్‌, సవర రాజేష్‌, సవర సోంహాద్రి, బిడ్డిక భరత్‌రాజ్‌, మండల నాయకులు పాల్గొన్నారు.