Jun 09,2023 23:51

పనస

ప్రజాశక్తి -అనంతగిరి:ఏజెన్సీ అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన ప్రాంతంలో పండే పనసకు భలే గిరాకీ ఉంటుంది. ఈ పనస ప్రతి ఏడాది జూన్‌ నుండి సెప్టెంబర్‌ నెల చివరి వరకు పలుచోట్ల లభిస్తుంది. కొంతమంది రైతుల భూములలో ఈ పనస చెట్లు తాతల కాలం నుంచి ఉన్నాయి. పనస పండ్లను వారపు సంతలకు తీసుకెళ్లి విక్రయిస్తారు. మండలంలో అనంతగిరి ఘాట్‌ రోడ్‌, కాశీపట్నం, శివలింగపురం, డమ్ముకు, బొర్రా జంక్షన్‌, అనంతగిరిలో పలువురు రైతులు పనసకాయల్ని విక్రయిస్తున్నారు.అనంతగిరి, అరకు పర్యాటక కేంద్రాలను తిలకించేందుకు వచ్చే విదేశీ, ఇతర ప్రాంతాలకు చెందిన పర్యాటకులు ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. ఒక్కొక్క పనసకాయ రకాన్ని బట్టి రూ.100. నుండి 250 వరకు ధర పలుకుతుంది. అనంతగిరి, వాలసీ, గుమ్మ, పెద్దబిడ్డ, లుంగపర్తి, వెంగడ, బొర్రా, కొండిబా పంచాయతీ గ్రామాల్లో అధికంగా పనసక కాయలు లభిస్తాయి.