ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
ఎల్‌ఐసి ఏజెంట్ల సమస్యల పరిష్కారానికి లియాఫీ ఒక దిక్సూచిలా పని చేస్తోందని లియాఫీ సెంట్రల్ జోన్ అధ్యక్షులు జంపాల కృష్ణారెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఎమ్మిగనూరు ఎల్‌ఐసి బ్రాంచి ఏజెంట్ల సమావేశం బ్రాంచి అధ్యక్షులు వెంకటేశ్వర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కృష్ణారెడ్డి, కడప డివిజన్ లియాఫీ అధ్యక్షులు జై భారత్ రెడ్డి హాజరయి మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి సంఘం నిరంతరం కృషి చేస్తోందని, ఏజెంట్ల గ్రూపు ఇన్స్యూరెన్స్ రూ.20 లక్షలకు పెంచాలని కోరారు. కుటుంబం మొత్తానికి మెడికల్ క్లెయిమ్ వర్తింపజేయాలని, గ్రూపు ఇన్స్యూరెన్స్ 80 ఏళ్ల వరకు పెంచాలని డిమాండ్ చేశారు. సంఘం ప్రతిష్టను పెంచడంలో ఎమ్మిగనూరు బ్రాంచి ముందు ఉంటుందన్నారు. ఎమ్మిగనూరు బ్రాంచిలో పనిచేస్తున్న ఎల్‌ఐసి ఏజెంట్లు ఎస్.అక్బర్, ఎం.జిక్రియా, కె.వెంకటేశ్వర్ రెడ్డి, ఎ.శ్రీనివాసులు 98 డీఎస్సీ నియామకాల్లో ఎంపిక కావడంతో ముఖ్య అతిథులు, డెవలప్‌మెంట్ ఆఫీసర్లు సన్మానించారు. అలాగే ఈ మధ్య సిఎం క్లబ్ మెంబర్‌కు శాశ్వతంగా ఎన్నికైన రాజగోపాల్ శెట్టిని సన్మానించారు. జోనల్ డివిజన్ బ్రాంచి నాయకులు రమేష్, కృష్ణ, ఆంధ్రయ్య, అనంతభూరళి, ప్రభాకర్ రెడ్డి, హరినాథ్, జయరాం, శివరాం, సోమన్న, సుధాకర్, విశ్వనాథ్, రంగస్వామి, నరసింహులు, వేణుగోపాల్, డెవలప్‌మెంట్ ఆఫీసర్ తిమ్మారెడ్డి, సుధాకర్ రావు, మొయినుద్దీన్ పాల్గొన్నారు.
ఉపాధ్యాయులుగా ఎంపికైన ఏజెంట్లను సన్మానిస్తున్న సభ్యులు










