
ప్రజాశక్తి - ఉండి
77వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి చేతుల మీదుగా ఉత్తమ ఎలక్ట్రికల్ ఎఇగా అవార్డు అందుకున్న ఉండి ఎలక్ట్రికల్ ఎఇ ముదునూరి మాధవ రాజుకు పలువురు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ అడ్వయిజరీ కమిటీ అధ్యక్షులు, ఉండి ఎంపిపి ఇందుకూరి శ్రీహరి నారాయణరాజు మాట్లాడుతూ విధుల్లో తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ మండలంలోని హైఓల్టేజీ సమస్యను పరిష్కరిస్తూ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్న మాధవరాజుకు ఉత్తమ అవార్డు రావడం అభినందనీయమన్నారు. ఇప్పటికే మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న ఓల్టేజీ సమస్యను తీరుస్తూ అవసరమైన చోట ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేస్తూ మండలంలో విద్యుత్ పవర్ కట్ లేకుండా చూస్తున్న మాధవరాజుకు అడ్వయిజర్ కమిటీ తరపున ధన్యవాదాలు తెలిపారు.