Oct 10,2023 20:42

భీమవరం:కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రతి జిల్లా నుంచి ఎగుమతులను ప్రోత్సహింతడానికి డిస్టిక్‌ హెజ్‌ ఎక్స్పోర్ట్‌ హబ్‌ (డిఇహెచ్‌్‌) కార్యక్రమాన్ని మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించి ఎగుమతిదారులు, స్థానిక పారిశ్రామికవేత్తలతో భాగస్వాముల సంప్రదింపుల కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎక్స్పోర్ట్‌ ప్రొమిషన్‌ సంయుక్త సంచాలకులు జిఎస్‌.రావు, జిల్లా పరిశ్రమల అధికారి వి.ఆదిశేషు, ఎఫ్‌ఐఇఒ సహాయ సంచాలకులు జి.రఘునాధబాబు, జిల్లాలోని ఆక్వా పరిశ్రమలు, కొబ్బరి పీచు పరిశ్రమలు, నరసాపురం లేస్‌ తయారీదారులు కార్యక్రమాల్లో పాల్గొని ఎక్‌పోర్ట్‌ ప్రొమిషన్‌ సంయుక్త సంచాలకులు ఎగుమతులకు గల అవకాశాలను, వాటిని అందిపుచ్చుకునే విధానాన్ని వివరించారు. జి.రఘునాధబాబు, ఎఫ్‌ఐఇఒ ఎగుమతిదారులకు అందించే సేవలు తెలిపారు. ఎగుమతిదారులు, పారిశ్రామికవేత్తల సందేహాలను నివృత్తి చేసి, వారి సలహాలు, సూచనలు జిల్లా ఎగుమతుల ప్రణాళికలో పొందుపరుస్తామని తెలిపారు.