Oct 02,2023 22:02

ప్రజాశక్తి - పాలకోడేరు
           శృంగవృక్షం పంచాయతీ పరిధిలో బంటుమిల్లిలో బంటుమిల్లి విద్యా ట్రస్ట్‌ సర్వసభ్య సమావేశం ట్రస్ట్‌ అధ్యక్షులు వీరవల్లి నరసింహరావు అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. రానున్న కాలంలో విద్యావ్యవస్థల్లో వచ్చే మార్పుల గురించి విద్యార్థులకు అందించాల్సిన సేవల గురించి చర్చించారు. విద్యా ట్రస్ట్‌ అధ్యక్షులు నరసింహరావు మాట్లాడుతూ కానిస్టేబుల్‌ స్థాయి నుంచి ఐపిఎస్‌ స్థాయి అధికారిగా అంచెలంచెలుగా ఎదగడం చాలా అరుదన్నారు. ఎఎస్‌పి పెద్దిరాజు విషయంలో ఇది నిజమైందన్నారు. వ్యవస్థాపక అధ్యక్షులు పంపన సాయిబాబు మాట్లాడుతూ ఒక ఐపిఎస్‌ స్థాయి అధికారి ఉండటం బంటుమిల్లి ప్రాంతానికి గర్వకారణమన్నారు. వీరవాసరం కళాపరిషత్‌ అధ్యక్షులు గుండా రామకృష్ణ మాట్లాడుతూ పెద్దిరాజు రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలన్నారు. అనంతరం ఎఎస్‌పిగా ఉద్యోగోన్నతి పొందిన బండి పెద్దిరాజును బంటుమిల్లి విద్యా ట్రస్ట్‌ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కడలి సాయిబాబు, నక్కెళ్ల శ్రీరామచంద్రమూర్తి, దొంగ భారతీ లక్ష్మికుమారి, వీరవల్లి దుర్గారావు, శ్రీరాములు, దూసనపూడి మాజీ సర్పంచి సవరం కాశీ విశ్వేశ్వరరావు, పంపన వెంకట సత్య శ్రీను పాల్గొన్నారు.