
ప్రజాశక్తి - ఆకివీడు
వైసిపి నాయకుడు షేక్ హుస్సేన్ భార్య షేక్ రసూల్ బిబి ఎఎంసి ఛైర్మన్‌గా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. సుమారు ఎనిమిది నెలల నుంచి ఖాళీగా ఉన్న ఆ పదవిని ఎట్టకేలకు ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా పూరించింది. ఆ మేరకు రసూల్ బిబిని ఛైర్మన్‌గాను, కాళ్ల మండలానికి చెందిన ఆనందరావును ఉపాధ్యక్షుడిగాను నియమిస్తూ మూడు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు వచ్చిన మరో గంటలోనే రసూల్ బిబి వైసిపి నియోజకవర్గ కన్వీనర్ డిసిసిబి ఛైర్మన్ పివిఎల్.నరసింహరాజు కార్యాలయంలో ఎఎంసి రికార్డుల్లో అధికారికంగా నమోదై సంతకాలు చేశారు. స్థానిక మార్కెట్ యార్డ్ కార్యాలయంలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు, మాజీ కన్వీనర్ గోకరాజు రామరాజు, క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ పాతపాటి శ్రీనివాసరాజు పాల్గొన్నారు.
కాళ్ల : ఆకివీడు ఎఎంసి డైరెక్టర్ పదవిని పడమట సుబ్బయ్యకు కేటాయించడం అభినందనీయమని గ్రామ సర్పంచి భూపతిరాజు వెంకటజగ్గరాజు అన్నారు. ఆకివీడు మండలంలో జరిగే ఎఎంసి డైరెక్టర్ల ప్రమాణస్వీకార కార్యాక్రమానికి ఏలూరుపాడు గ్రామం నుంచి మోటార్‌సైకిల్ ర్యాలీగా పడమట సుబ్బయ్య బయలుదేరారు. ఎంపిటిసి సభ్యులు చిన్నాపరపు రాంబాబు, వైసిపి గ్రామ అధ్యక్షులు దాట్ల శ్రీనివాసరాజు, వైసిపి నాయకులు మంతెన రామకృష్ణంరాజు, కొండా రమణ, పచ్చిగోళ్ల శ్రీను, పడమట సతీష్, కోనా రంజిత్ పాల్గొన్నారు.