ఏఎల్‌ఒ సాయిజ్యోతికి ప్రతిభా పురస్కారం అందజేస్తున్న జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొట్టు సత్యనారాయణ
ప్రజాశక్తి-బాపట్ల రూరల్: బాపట్ల అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ పీ సాయిజ్యోతికి ప్రతిభా పురస్కారం దక్కింది. 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆమెకు ప్రతిభా పురస్కారం అందజేశారు. విధి నిర్వహణలో ఆమె చూపిన ప్రతిభ ఆధారంగా ఈ పురస్కారం ప్రభుత్వం అందించింది. ఈ సందర్భంగా సాయిజ్యోతికి పలువురు అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.










