
ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్ : విద్యా పరిషత్ ఉన్నత పాఠశాల ఇడుపులపాడు నందు విద్యార్థులు తల్లిదండ్రుల సమావేశం నిర్వహించినాము. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పిడపర్తి పేరి రెడ్డి అధ్యక్షత వహించినాడు, పేరెంట్స్ కమిటీ చైర్మన్ బార్లపూడి ప్రభాకర్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల తల్లిదండ్రుల సమావేశంలో ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షల్లో విద్యార్థులు సాధించిన ప్రగతి గురించి తల్లిదండ్రులకు వివరించారు ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న సౌకర్యాలు తల్లిదండ్రులకు వివరించారు. విద్యార్థులను చిన్నతనం నుండి క్రమశిక్షణలో ఉంచి ప్రతినిత్యం పాఠశాలకు పంపించి, పాఠశాలలో జరుగుతున్న కార్యక్రమాలు తెలుసుకొని విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పడాలని కోరినారు. ప్రతిరోజు ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్నామని , మధ్యాహ్న భోజనం సరిగా జరుగుతున్నదా లేదా అనేది మీరు పరిశీలించుకోవచ్చని అలాగే ప్రభుత్వం ఇస్తున్న అన్ని సదుపాయాలు సక్రమంగా ఉపయోగించుకోవాలని కోరినారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పర్వత నేని పావని, భవనం శివలీల, పెండ్యాల పావని ,బండారు అనిల్ కుమార్ ,అంబటి సురేష్ ,వసంత రఘుబాబు, సిహెచ్ శ్రీవిద్య లక్ష్మి, పెండ్యాల రాధిక, గోబిదేశి ఆదినారాయణ, వరికొల్లు బ్రహ్మయ్య, గోరంట్ల సంధ్యారాణి, అంబటి అపర్ణ, కంబాలపాటి నరసయ్య, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు