May 13,2023 01:53
ప్రిన్సిపాల్‌ యేనొక్‌ను అభినందిస్తున్న ఐఆర్‌ఈఎఫ్‌ విద్యాసంస్థల అధినేత బిషప్‌ డాక్టర్‌ ఇమ్మానుయేలు రెబ్బా తదితరులు

ప్రజాశక్తి-రేపల్లె: ఎడ్యుకేషన్‌ విభాగంలో రేపల్లె పట్టణానికి చెందిన ఐఆర్‌ఈఎఫ్‌ విద్యాసంస్థలలోని ఆర్‌సీ బీఎడ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వర్తిస్తున్న గొరక పూడి యేనొక్‌ ఆచార్య నాగార్జున యూనివర్శిటీ నుంచి డాక్టరేట్‌ను అందుకున్నారు. ఆంధ్ర లూథరన్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎస్తేర్‌ సునీలా పర్యవేక్షణలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో సంపూర్ణ అక్షరాస్య కార్యక్రమంపై, బోధన, పరిపాలనా విభాగం వైఖరులపై ఆయన పరిశోధనలు నిర్వహించి ఇటీవల యూనివర్సిటీ నుంచి డాక్టరేట్‌ ను అందుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక కళాశాల ప్రాంగణంలో శుక్రవారం డాక్టర్‌ యేనొక్‌కు నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ఐఆర్‌ఈఎఫ్‌ విద్యాసంస్థల బిషప్‌ డాక్టర్‌ ఇమ్మానుయేలు రెబ్బా ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఆర్‌సీ కళాశాలల అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ జాషువా రెబ్బా, ప్రవాసాంధ్రుడు జాన్‌ రెబ్బా, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు అభినందనలు తెలిపారు.