పండిపోయిన
పళ్ళు రెండు
చిలుకలకై ఎదురుచూస్తున్నాయి
చిలకలేమో...
చిల్లర పైసల పరిమళాలకు ఆశపడి
అనుభవాలను తీపిగా నింపుకున్న
అపురూప మధుర ఫలాలను
వెలిసి వెళ్ళిపోయాయి...
దేనికైనా పెట్టి పుట్టాలి...
మమ్ము తినమని పళ్ళ ఏడుపు
మాకొద్దని చిలుకల ఏడుపు
ఈ ఏడుపుల మధ్య చెంతకు చేరుతున్నది
చివరి మజిలీ కట్టెలపానుపు
- అభిరామ్
9704153642