Jul 14,2023 22:03

ఫొటో : విజయకేతనం చూపుతున్న ట్రిపుల్‌ఐటీకి ఎంపికైన విద్యార్థులు

ఏడుగురు విద్యార్థులకు ట్రిపుల్‌ ఐటీ సీట్లు
ప్రజాశక్తి-ఉదయగిరి : వెనుకబడిన మెట్ట ప్రాంత ప్రభుత్వ పాఠశాల నుండి ట్రిపుల్‌ ఐటీలో సిట్లు సాధించడంపై ముఖ్యమంత్రికి, అధ్యాయపక బృందంకు స్థానికులు అభినందనలు తెలిపారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ అల్తూరి రామిరెడ్డి హై స్కూల్‌లో హెచ్‌ఎం బాల కేశవులు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విద్యార్థులు అభినందన సభలో తల్లిదండ్రులు స్థానికులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా అధ్యాయపక బృందం మాట్లాడుతూ 2022- 23 బ్యాచ్‌లో ఆర్‌ కీర్తన, విద్య, తనుశ్రీ, షేక్‌ అర్షియ, షేక్‌ రిజ్వాన, షేక్‌ తన్వీర్‌, షేక్‌ అవేజ్‌, షేక్‌ ఖాతిజ సీట్లు సాధించినట్లు తెలిపారు. వారిలో ఆరుగురికి విడుపులపాయలో సీట్లు రాగా ఒకరికి మాత్రం క్రీడాకారుల కోటా కింద నూజువీడు వస్తుందన్నట్లు వారు తెలిపారు. విద్యార్థిని తల్లిదండ్రులు అధ్యాయపక బృందానికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో షరీఫ్‌ అధ్యాయపక బృందం పాల్గొన్నారు.