ఏడుగురు ఎర్రచందన స్మగ్లర్లు అరెస్ట్
ప్రజాశక్తి -తిరుపతి సిటీ: ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఏడుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని వారి నుంచి మూడు కోట్ల 70 లక్షల రూపాయలు విలువ చేసే ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ పరమేష్ రెడ్డి తెలిపారు. స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండులో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ రేణిగుంట రూరల్ పరిధిలో డిఎస్పి భవ్య కిషోర్ పర్యవేక్షణలో రేణిగుంట రూరల్ సీఐ సుబ్బరాయుడు, ఎస్‌ఐ ధర్మారెడ్డి గాజులమండ్యం పోలీసు స్టేషన్ సిబ్బంది కలిసి యోగానంద కాలేజ్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో అటుగా వచ్చిన టాటా లారీ, .సుజుకి ఎర్టిగా . టొయోట క్రిస్తా కార్లను తనిఖీ చేయగా అందులో చేస్తున్నట గుర్తించారు. 4635.200 గ్రాముల బరువు గల 405 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ.3,70,80,000 రూపాయలు ఉంటుందన్నారు. పోలీసులు ఎర్రచందనం దుంగలను, చెక్కలను సీజ్ చేసి, 7 మందిని అదుపులోకి తీసుకొనడమైనది. పట్టుబడిన నిందితులలో అన్నమయ్య జిల్లా పరిసర ప్రాంతానికి చెందిన వారే అని తెలిపారు. పట్టుబడిన నిందితులలో ఇద్దరిపై పాత కేసులు ఉన్నాయి. ఈ ముఠాకు ప్రధాన సూత్రధారులు అయిన సింగమల గిరిబాబు పై 7 ఎర్ర చందనం కేసులు, యజ్ఞం చంద్ర శేఖర్ పై 15 ఎర్ర చందనం కేసులు నమోదు అయి వున్నాయి. వీరిద్దరిపై గతంలో పీడీయాక్ట్ ప్రయోగం జరిగింది, జైలు శిక్ష కూడా అనుభవించారు. అయినా వారి ప్రవత్తి మార్చుకోకుండా మళ్లీ ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడ్డారు. వీరిద్దరిపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని మిగిలిన వారిపై పక్క జిల్లాలలో గానీ, ఇతర రాష్ట్రాల్లో గానీ ఏమైనా కేసులు నమోదయి ఉన్నాయా? అని ఆరా తీస్తున్నామన్నారు. వీరు ఎర్రచందన దుంగలను రైల్వే కోడూరు నుంచి తమిళనాడు చెన్నైకు చెందిన గుణశేఖర్, మరో వ్యక్తికి అమ్మడానికి తరలిస్తుండగా నిఘా వ్యవస్థ సమాచారం మేరకు బుధవారం ఉదయం యోగానంద కాలేజీ వద్ద మాటు వేసి, వారిని చుట్టుముట్టి అరెస్టు చేశామన్నారు. ఈ మేరకు వీరుపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నామన్నారు. ఈ కేసు ఛేదనలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అదనపు ఎస్పి కులశేఖర్, రేణిగుంట డిఎస్పి భవ్య కిషోర్, రేణిగుంట రూరల్ సీఐ సుబ్బరాయుడు, ఎస్సై ధర్మారెడ్డి, గాజులమండ్యం పోలీసు స్టేషన్ సిబ్బందిని జిల్లా ఎస్‌పి అభినందించి, రివార్డులు ప్రకటించారు.
పోలీసుల అదుపులో స్మగ్లర్లు










