ప్రజాశక్తి - పెనుమంట్ర
ఈ నెల 27వ తేదీ నుంచి ఏడు రోజుల్లో సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల సహకారంతో కులగణన ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని భీమవరం డ్వామా అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ శివప్రసాద్ యాదవ్ అన్నారు. మంగళవారం ఎంపిడిఒ కార్యాలయంలో ఎంపిపి కర్రి వెంకటనారాయణ రెడ్డి (వాసురెడ్డి) ఆధ్వర్యంలో పంచాయతీ సర్పంచులకు, ఎంపిటిసిలకు, సచివాలయ ఉద్యోగులకు, పంచాయతీ కార్యదర్శులకు, డిఆర్‌డిఎ, ఎఒలకు కులగణనపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శివప్రసాద్ యాదవ్ మాట్లాడారు. కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ ఏలియమ్మ, ఎంపిడిఒ పి.పద్మజ, ఎఒ వి.పూర్ణబాబ్జి పాల్గొన్నారు.
ఆచంట:రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన సామాజిక సమానత్వానికి, విద్య, ఆర్థిక పురోగతికి ఎంతో దోహదపడుతుందని జిల్లా బిసి వెల్ఫేర్ అధికారి జివిఆర్‌కెఎస్‌ఎస్.గణపతి అన్నారు. సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఒ పి.నరసింహప్రసాద్ అధ్యక్షతన కులగణనపై అధికారులతో సోమవారం సమీక్షించారు. సమావేశంలో గణపతిరావు మాట్లాడుతూ కుల గణనలో పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపిడిఒ పి.నరసింహ ప్రసాద్, తహశీల్దార్ సుబ్రహ్మణ్యం, ఇఒపిఆర్‌డి.మూర్తిరాజు పాల్గొన్నారు.
పోడూరు : ఆర్థిక, సామాజిక స్థితిగతులను మెరుగుపర్చేందుకు సంక్షేమ పథకాల పారదర్శకతకు ప్రభుత్వం కులగణన చేస్తోందని డిపిఒ ఎన్‌విఎస్.ప్రసాద్‌యాదవ్ పేర్కొన్నారు. ఎంపిడిఒ కార్యాలయంలో సచివా లయ ఉద్యోగులు, పంచాయతీ కార్యదర్శులు, వాలంటీర్లు, సర్పంచులు ఎంపిటిసిలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో తహశీల్దార్ ఆర్‌వి కృష్ణారావు, ఎపిడిఒ సుహాసిని, జెడ్‌పిటిసి పెద్దిరాజు పాల్గొన్నారు.
పెనుగొండ : మండలంలోని నిర్వహిస్తున్న సమగ్ర కుల గణన సర్వేకు ప్రజలు సహకరించాలని ఎండిఒ శ్రీనివాస్ దొర అన్నారు. పెనుగొండలో టిటిడి కళ్యాణ మండపంలో మంగళవారం సమగ్ర కులగణన సర్వే అధికారుల ఆదేశాల మేరకు నిర్వహిస్తానని వివరించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ గురుమూర్తి రెడ్డి, సర్పంచులు పాల్గొన్నారు.