చాపాడు : శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు ఎడతెరిపిలేని అధిక వర్షంతో వ్యవసాయ భూములు పూర్తిగా పదునెక్కాయి. పంట పొలాలలో ఎక్కడ చూసినా వర్షపు నీటితో దర్శనమిస్తున్నాయి. మండల పరిధిలోని కేతవరం నుంచి ప్రొద్దుటూరు వైపు గ్రామాలలో మాత్రమే మోస్తారు వర్షం నమోదైంది. రాత్రి తిరిగి మండల వ్యాప్తంగా పూర్తి స్థాయిలో వర్షం నమోదైంది .ఈ ఖరీఫ్ సీజన్‌లో శనివారం రాత్రి కురిసిన వర్షం అధికం అని చర్చించుకుంటున్నారు. మండల వ్యాప్తంగా 92.2మిమి వర్షపాతం నమోదైంది. వారం రోజులుగా ఎండ తీవ్రత అధికమై విద్యుత్ కోతలు మొదలు కావడంతో ప్రజలు నానా అవస్థలు పడేవారు. వరి పంటను సాగు చేసే రైతులు విద్యుత్ సరఫరాలో అంత రాయం కలుగుతుండడం, బోర్లలో నీరు సరిగా రాకపోవడంతో సమస్యలు ఎదుర్కొంటూ రోజూ కొంతమేర మాత్రమే పంట సాగు చేసేవారు. ప్రస్తుతం కురిసిన అధిక వర్షా నికి వరి పంట సాగు చేసే రైతులకు ఉపయోగకరంగా మారింది. ఆరుతడి పంటలు సాగు చేసే రైతులకు కూడా భూమి పూర్తి స్థాయిలో పదునైందని భూమి అరగానే దుక్కీలు చేపట్టి విత్తనం వేసే ఏర్పాట్లు చేయొచ్చని రైతులు పేర్కొంటున్నారు. మైదుకూరు మండల వ్యాప్తంగా కూడా శనివారం రాత్రి అధిక వర్షం చోటు చేసుకున్నది. రోడ్ల వెంట ఎక్కడ చూసినా వర్షపు నీరే పోర్లి ప్రవహిస్తూ ఉంది. మైదుకూరు పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున రోడ్లు పూర్తిగా నీటితో నిండిపోయాయి. దీనితో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కాలువలు, వంకలలో నీటి ప్రవాహం ప్రారంభమైంది.
భారీ వర్షంతో రైతుల్లో ఆశలు
పులివెందుల టౌన్ : శనివారం రాత్రి కురిసిన భారీ వర్షం ఖరీఫ్ సీజన్ పం టల సాగులో రైతుల్లో ఆశను నింపింది. తీవ్ర వర్షాభావంతో పంటలు ఎండు దశకు చేరుకుంటున్న తరుణంలో ఈ వర్షం ఊరటనిచ్చింది. వేరుశనగ, పత్తి పంటలు సాగులో ఉన్నాయి. విత్తు విత్తినప్పటి నుంచి వర్షాలు లేక పంటలు దెబ్బతింటున్నానే ఆందోళనలో రైతులు కొట్టు మిట్టాడారు. ఈ నేపథ్యంలో భారీ వర్షం పడడం వారిలో ఆనందాన్ని తెచ్చింది. పొలాల్లో చేరిన వర్షపు నీరు










