తూము గేటుకుమరమ్మతులు చేస్తున్న ప్రాజెక్టు సిబ్బంది
తూము గేటుకుమరమ్మతులు చేస్తున్న ప్రాజెక్టు సిబ్బంది
ఎడమ కాలువ తూము గేటుకు మరమ్మతులు
ప్రజాశక్తి - లింగసముద్రం:రాళ్లపాడు ప్రాజెక్టు ఎడమ కాలువ తూము గేటును అధికారులు మరమ్మతులు చేయించారు.ఎడమ కాలువ తూము గేటు విరిగి కింద పడిపోవడంతో తూము గేటు పైకి లేవడంలేదు.దీంతో ప్రాజెక్టు అధికారులు గతంలో నామమాత్రం మరమ్మతులు చేయడంతో ఎలాంటి ప్రయోజనమూ లేకుండా పోయింది.రానున్న వర్షాకాలంలో ప్రాజెక్టులోకి నీళ్లు చేరితే కాలువకు నీళ్లు విడుదల చేయాడానికి ఇబ్బందులు వస్తాయని ఆయకట్టు రైతులు ఆందోళన చేశారు.దీంతో అధికారులు స్పందించి తూము గేటును పూర్తి స్థాయిలో మరమ్మతులు చేశారు.దీంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేశారు.










