May 03,2023 00:36
ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-రేపల్లె: ఎడ్ల బండ లాగుడు పోటీలకు రైతుల నుంచి మంచి స్పందన లభించిందని నిర్వాహకులు సుదర్శన్‌ తెలిపారు. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణరావు సహకారంతో పట్టణంలోని జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో మంగళవారం ఎడ్ల బండలాగుడు పోటీలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మొత్తం 16 జతల ఎడ్లు ఈ పోటీలలో పాల్గొన్నట్లు తెలిపారు. మేడే సందర్భంగా ఈ పోటీలను నిర్వహించినట్లు చెప్పారు. గెలుపొందిన ఎడ్లకు ప్రథమ బహుమతి రూ.12 వేలు ద్వితీయ బహుమతి రూ.10 వేలు ఇతర కన్సోలేషన్‌ బహుమతులు ఉన్నట్లు చెప్పారు.