Nov 16,2023 00:49

ఏచూరికి సమస్యను తెలుపుతున్న అప్పలరాజు

ప్రజాశక్తి-నక్కపల్లి:హెటిరో పైప్‌ లైన్‌ సమస్య ను సిపిఎం అఖిల భారత ప్రదాన కార్యదర్శి సీతారాం ఏచూరి దృష్టికి తీసుకు వెళ్లినట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.అప్పలరాజు స్థానిక విలేకరులకు తెలిపారు. విజయవాడలో బుధవారం జరిగిన అసమానతలు లేని అభివృద్ది కోసం సిపిఎం చేపట్టిన ప్రజా రక్షణ భేరి బహిరంగ సభకు ఏచూరి విచ్చేయడంతో ఆయనను కలిసి హెటిరో పైప్‌లైన్‌పై వినతి పత్రం అందజే శామన్నారు. కొత్త పైపులు ఏర్పాటు చేయడంతో మత్స్యకారులకు కలుగు ఇబ్బందులను, నష్టాలను ఆయన దృష్టికి తీసుకు వెళ్ళమన్నారు.ఎన్‌జిటిలో కేసు విచారణలో ఉండగా అన్ని అనుమతులు లేకుండా, చట్టాలను ఉల్లంఘించి కంపెనీ యాజమాన్యం రెండవ పైప్లైన్‌ పనులు ప్రారంభించిందని ఆయన దృష్టికి తీసుకెళ్లామన్నారు .వినతి పత్రం అందజేసిన వారిలో మండల కార్యదర్శి ఎం.రాజేష్‌, రాజయ్యపేట శాఖ కార్యదర్శి ఎం.మహేష్‌ బాబు తదితరులు ఉన్నారు.